Mobile Popup Ad
Mobile Popup Ad

ఎల్లుండి ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. కీలక అంశాలపై చర్చ

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) నేతలు ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తోపాటు రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వెళ్లనున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. అలాగే కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్ఠానంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సంప్రదింపులు జరిపే అవకాశాలున్నాయి.

ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో తెలంగాణ నేతలు భేటీ కానున్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ సంస్థాగత మార్పులపై చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత వెంటనే కాంగ్రెస్ నేతలు ఢిల్లీ (Delhi)కి వెళ్తుండటంతో ఈ పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Read Also: ఇదేం పిచ్చి పని.. శివుడికి గంజాయి ప్రసాదంగా పెట్టిన పోకిరీలు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>