కలం, వెబ్‌డెస్క్: భారత్‌పై విధించిన టారిఫ్స్‌ను అమెరికా తగ్గించింది (US Tariff Cut). 25శాతం నుంచి 18శాతానికి మార్చింది. ఈ క్రమంలో సుంకాల తగ్గింపు వల్ల మనకు లాభం కలుగుతుందని అధికార పార్టీతోపాటు, వాణిజ్య వర్గాలు, పరిశ్రమల యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఈ డీల్ కుదరడం వెనక అమెరికా కొన్ని కండిషన్లు పెట్టిందని, అందులో రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేయాలనే షరతు ఒకటని వినిపిస్తోంది. దీనిపై భారత ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు.
ఒకవేళ అమెరికా కండిషన్స్‌కు ఒప్పుకొని, రష్యా (Russia) నుంచి మన దేశం ఆయిల్ కొనడం పూర్తిగా మానేసి.. అమెరికా నుంచి కొంటే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రష్యా మనకు డిస్కౌంట్లు పోనూ.. ఒక్కో బ్యారెల్ ఆయిల్‌ను 40 డాలర్లకు సరఫరా చేస్తున్నది. అదే.. అమెరికా మాత్రం 50 నుంచి 60 డాలర్లకు పంపుతున్నది.
రష్యా నుంచి వచ్చే ఆయిల్లో రవాణా, బీమా ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్‌కు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. భవిష్యత్తులో అమెరికాతో తక్కువ ధరకే కొనేలా ఒప్పందం జరిగే అవకాశాలు ఉన్నాయని.. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి ప్రభావం ఉండదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
రూపాయి బలపడేనా!
ఇన్నాళ్లూ ట్రంప్ (Donald Trump) టారిఫ్‌ల ఎఫెక్ట్, అంతర్జాతీయ పరిణామాల వల్ల అమెరికా డాలర్‌తో పోలిస్తే భారతీయ కరెన్సీ విలువ భారీగా పతనమవుతూ వచ్చింది. ఈ ఏడాది జనవరి 30న ఏకంగా 92 మార్క్‌ను దాటిపోయి.. అత్యంత కనిష్ఠానికి చేరింది. 2014లో 60 మార్క్ దగ్గర బలంగా ఉన్న రూపాయి విలువ.. ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారీగా పతనమవుతూ వచ్చింది.
ప్రస్తుతం టారిఫ్‌లను తగ్గించడంతో (US Tariff Cut) రూపాయి కోలుకుంటున్నది. ఫిబ్రవరి 2న 91.27 వద్ద ఉండగా.. అది మంగళవారం 1.5శాతం తగ్గి 90 మార్క్ దగ్గర కొనసాగుతున్నది. రూపాయి బలపడితే భారతీయ ఆర్థిక వ్యవస్థకు ఊతం. అమెరికాతోనే కాకుండా ఇతర దేశాలతో జరిగిన ఫ్రీ ట్రేడ్ డీల్స్ వంటివి కలుపుకొంటే రూపాయి 90 మార్క్ కిందికి దిగివచ్చే అవకాశాలూ లేకపోలేదని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
Read Also: జీరో టారిఫ్.. ఐఫోన్, హార్లే డేవిడ్సన్పై ఆదా!
Follow Us On: Pinterest


