ఉద్యోగుల విశ్రాంతికి చైనా కొత్త ప్లాన్.. గడ్డి లౌంజ్ చైర్ ల ఏర్పాటు

కలం, వెబ్​ డెస్క్​ : ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గించడానికి చైనా (China) కొత్త ప్లాన్​ చేసింది. అలసటగా ఉండి విశ్రాంతి తీసుకోవడానికి లౌంజ్ చైర్ లను​ (Lounge Lawn)ఏర్పాటు చేశారు. షాంఘై (Shanghai) నగరంలో సుజౌ క్రీక్ ఒడ్డున వీటిని రూపొందించారు. ఇది నగరంలో ఒత్తిడితో బతికే ఉద్యోగులకు చిన్న విరామ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించిన గడ్డి మైదానం. ఈ లౌంజ్ లాన్ సుమారు 30 మీటర్ల పొడవుతో ఉంది. ఇది ఒక పెద్ద లౌంజ్ చైర్ (Recliner) లాగా డిజైన్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్​ మీడియాలో వైరల్ గా మారాయి. తమ దేశంలో కూడా ఇలాంటివి ఉంటే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గడ్డి మెట్లు సుమారు 135 డిగ్రీల కోణంలో రూపొందించారు. ఇది శరీరానికి సహజంగా సరిపోయేలా, పడుకుని నిద్రపోవడానికి లేదా రిలాక్స్ అవ్వడానికి అనువుగా ఉంటుంది. అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఆర్కిటెక్చర్ సంస్థ ససాకి (Sasaki) ఈ డిజైన్‌ను రూపొందించింది. ఈ ప్రదేశం యున్‌జిన్ రోడ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న రన్‌వే పార్క్ (Xuhui Runway Park)లో భాగంగా ఉంది. ఇది 1970లలో నిర్మించిన పాత ఎయిర్‌పోర్ట్ రన్‌వేను పునరుద్ధరించి తయారు చేశారు.

సుజౌ క్రీక్ ఒడ్డున ఉన్న ఈ గడ్డి మైదానం షాంఘై (Shanghai) లోని ఉద్యోగులకు విశ్రాంతి ప్రదేశంగా మారింది. చైనాలో సగటు నిద్ర సమయం 7 గంటల కంటే తక్కువగా ఉండటం, ఎక్కువ ఒత్తిడి వల్ల ఇలాంటి బయోఫిలిక్ (ప్రకృతి సన్నిహిత) డిజైన్‌లు వేగంగా పాపులర్ అవుతున్నాయి. అధ్యయనాల ప్రకారం ఇలాంటి ఆకుపచ్చ ప్రదేశాలు ఆందోళనను 20 శాతం వరకు తగ్గించి ప్రశాంతంగా ఉండేందుకు దోహదపడుతాయి.

Read Also: రీల్స్ పిచ్చితో రైల్వే ట్రాక్‌పై పడుకున్న యువకుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>