చైనా పర్యటనకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్

కలం, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump)  చైనా పర్యటన ఖరారైంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ఈ నెల 13 నుంచి 15 వరకు చైనాలో పర్యటించనున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. 14వ తేదీన షీ జిన్‌పింగ్, ట్రంప్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగబోతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా చైనా చారిత్రక కట్టడం ‘టెంపుల్ ఆఫ్ హెవెన్‌’ను ట్రంప్ సందర్శించనున్నారు.

9 ఏళ్ల తరువాత..

అమెరికా అధ్యక్షుడు తొమ్మిదేళ్ల తర్వాత చైనాలో పర్యటించబోతుండటం గమనార్హం. చివరిసారి కూడా ట్రంప్ బీజింగ్ పర్యటనకు వచ్చారు. ఇరాన్–అమెరికా యుద్ధం నేపథ్యంలో ట్రంప్ డ్రాగన్ దేశానికి వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ యుద్ధాన్ని ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించిన చైనా.. ఇరాన్ కు తాము అండగా ఉంటామని కూడా ప్రకటించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>