కలం వెబ్ డెస్క్ : సిరియా(Syria)లోని ఐసిస్(ISIS) ఉగ్రవాదులపై అమెరికా వైమానిక దాడులు(airstrikes) ప్రారంభించింది. ఇటీవల ఐసిస్ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులు, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) ఆదేశాలతో దాడులు ప్రారంభించినట్లు ఆ దేశ రక్షణ కార్యదర్శి పిట్ హెగ్సేత్ వెల్లడించారు. సిరియాలోని ఆయుధ నిల్వ కేంద్రాలు, సరఫరా కేంద్రాలు, కార్యాచరణ భవనాలపై దాడులు జరుపుతున్నట్లు సమాచారం.
అమెరికాపై ఎవరు ఎలాంటి దాడులకు పాల్పడ్డా, బెదిరింపులు చేసినా బలమైన దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఐసిస్‌ను నిర్మూలించగలిగితే సిరియాకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు.
Read Also: నేడు బీజేపీలో చేరనున్న సినీ నటి ఆమని
Follow Us On: Pinterest


