Mobile Popup Ad
Mobile Popup Ad

మత్తువదలరా.. ఎస్‌ఆర్‌ నగర్‌లో డ్రగ్స్​ కలకలం

కలం, వెబ్​ డెస్క్​: హైదరాబాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో డ్రగ్స్(Drugs) లభించడం కలకలం రేపుతోంది. ఎస్‌ఆర్‌ నగర్‌(SR Nagar) పరిధిలోని ప్రైవేటు ఆస్పత్రిలో కేఫిటేరియా మేనేజర్ వద్ద డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మేనేజర్ ఆసిఫ్ వద్ద ఎమ్‌డీఎమ్‌ఏ(MDMA) డ్రగ్స్‌ను పట్టుకున్నారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మరికొద్దిరోజుల్లో నూతన సంవత్సరం రానుంది. దీంతో డ్రగ్స్ మూలాలపై ఇప్పటికే నార్కొటిక్స్ బ్యూరోతో పాటు హైదరాబాద్ పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో డ్రగ్స్ ను పట్టుకున్నారు.

గత కొంతకాలంగా ఆసిఫ్ వ్యక్తిగతంగానే డ్రగ్స్‌ (Drugs) ను ఆస్పత్రికి తీసుకెళ్లి సేవిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఎమ్‌డీఎమ్‌ఏ డ్రగ్‌ ఎవరి ద్వారా ఆసిఫ్‌కు సరఫరా అవుతుందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లో ప్రతీ సారి డ్రగ్స్ వినియోగం భారీగా ఉంటోంది. ఈ ఏడాది ఎక్కడా కూడా డ్రగ్స్ మాట వినపడొద్దనే ఉద్దేశంతో పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా డ్రగ్స్ తీసుకుంటున్న ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారిస్తున్నారు పోలీసులు. అతడిచ్చే సమాచారంతో మరి కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read Also: బిహార్ డాక్టర్‌కు జార్ఖండ్ సర్కార్ ఆఫర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>