కలం వెబ్ డెస్క్ : కొద్ది రోజులుగా కొండెక్కుతున్న బంగారం ధర(Gold Prices)లు ఎట్టకేలకు కొద్దిగా దిగొచ్చాయి. గత రెండు రోజులుగా అమెరికా డాలర్ విలువ తగ్గిపోతుండటమే దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో కొద్దిరోజులుగా పరుగులు పెట్టిన బంగారం, వెండి (Silver) ధరలు కాస్త నెమ్మదించాయి. సోమవారం నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు తులం బంగారం ధర రూ,1,520 వరకు తగ్గింది. తర్వాత మంగళవారం నుంచి నేడు బుధవారం ఉదయం 6 గంటల వరకు తులం బంగారంపై మరో రూ.100 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,33,850గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,22,690గా కొనసాగుతుంది.
ఇక హైదరాబాద్(Hyderabad)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,690గా ఉంది. మరోవైపు విజయవాడ(Vijayawada)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,690 వద్ద కొనసాగుతోంది. అయితే బంగారం ధరలు(Gold Prices) ఇలాగే తగ్గుముఖం పట్టవచ్చన్న గ్యారెంటీ లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్‌లో మార్పులకు అనుగుణంగా మళ్లీ ధరలు భారీగా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
Read Also: మరో 20 దేశాలపై అమెరికా ట్రావెల్ బ్యాన్
Follow Us On: Sharechat


