ఇరాన్​ వార్​.. యూరియా క్రైసిస్

కలం, సెంట్రల్ డెస్క్: భారత్‌లో యూరియా వినియోగం ఏటికేడు పెరుగుతున్నది. దేశీయంగా ఉత్పత్తి (Urea Production) ఉన్నా డిమాండ్‌కు సరిపడా లేదు. దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తున్నది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్‌.. ఎల్‌ఎన్‌జీ సరఫరాలో ఆటంకాలు.. పూర్తిస్థాయిలో నడవని యూరియా ఉత్పత్తి ప్లాంట్లు.. సగానికి పడిపోయిన ప్రొడక్షన్.. వ్యవసాయానికి ఎలాంటి ఆటంకాలు రానివ్వబోమని ప్రధాని మోదీ, సీఎం రేవంత్ చెప్తున్న మాటలు.. అయినా రైతుల్లో ఆందోళన.. పాలకులు చెప్తున్న భరోసా మాటల వెనుక ఎక్కడో సంక్షోభం రానుందన్న కలవరం!!

మరో రెండు నెలల్లో వానాకాలం సీజన్.. తొలకరి పడితే వరి నాట్లు వేయాలంటే యూరియా ఉండాల్సిందే. కానీ ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న బఫర్ స్టాక్ అంతంతే. ఇప్పటికే యుద్ధం కారణంగా నెల రోజుల నుంచి ప్రొడక్షన్ భారీగా తగ్గింది. రాబోయే రెండు నెలల్లో చేసుకునే ఉత్పత్తి, దిగుమతులే ఆధారం. పంట సీజన్ మొదలైన ప్రతిసారి రాష్ట్రంలో యూరియా కోసం రైతుల అరిగోస.. ఎరువుల షాపుల ముందు, సహకార సంఘాల ముందు క్యూలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు ప్రొడక్షన్ కూడా తగ్గిపోవడంతో మున్ముందు ఎలా ఉంటుందో తెలియని అయోమయం.

దేశ, రాష్ట్ర అవసరాలకు కావాల్సిన యూరియా ఎంత? ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రం వద్ద ఉన్న బఫర్ స్టాక్ ఎంత? వచ్చే రెండు నెలల్లో ఉత్పత్తి అయ్యేది ఎంత? ఎంతమేర ఉత్పత్తి చేస్తే, ఎన్ని టన్నులు దిగుమతి చేసుకుంటే దేశ అవసరాలకు సరిపోతుంది? యుద్ధం వల్ల ఎరువుల ఉత్పత్తిలో వచ్చిన ఆటంకాలు ఏమిటి?.. వీటన్నింటిపై కలం 360 డిగ్రీస్ స్పెషల్ పేజ్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Urea Production
Urea Production

Read Also: కేసీఆర్‌తో వ్యక్తిగత గొడవల్లేవు : సీఎం రేవంత్

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>