epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఇక‌ యూపీఎస్సీ పరీక్షల్లో ఫేస్ రికిగ్నీష‌న్‌!

క‌లం వెబ్ డెస్క్‌ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షల భద్రతను పెంచేందుకు కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. ఇక‌పై పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల‌ను ఫేస్ రికిగ్నీష‌న్‌ (Facial Recognition) ద్వారా తనిఖీ చేయనుంది. యూపీఎస్సీ ఈ మేర‌కు అధికారిక నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. యూపీఎస్సీ పరీక్షల్లో పాల్గొనే ప్రతి అభ్యర్థి పరీక్షా కేంద్రంలో ఫేస్ రికిగ్నీష‌న్‌కు హాజర‌వ్వాల‌ని పేర్కొంది. యూపీఎస్సీ 2025లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నేవల్ అకాడమీ , కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) పరీక్షల్లో ఏఐ ఆధారిత (AI Verification) ఫేస్ రికిగ్నీష‌న్‌ సాంకేతికతను పైల‌ట్‌ ప్రోగ్రాంగా విజయవంతంగా పరీక్షించింది.

ఈ పరీక్షలు సెప్టెంబర్ 14, 2025న గౌరగామ్‌లోని కొన్ని కేంద్రాల్లో నిర్వహించారు. అభ్యర్థుల ఫేస్ రికిగ్నీష‌న్‌తో రిజిస్ట్రేషన్ ఫాంలో ఇచ్చిన ఫోటోలతో డిజిటల్‌గా సరిపోల్చి తక్షణమే గుర్తింపు చేసినట్లు తెలిపారు. యూపీఎస్సీ (UPSC) ఛైర్మన్ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సిస్టమ్ వాడటం వల్ల సగటున కేవలం 8 నుంచి 10 సెకన్లలో ఒక్కో అభ్యర్థి ధృవీకరణ పూర్తి అవుతుంద‌ని చెప్పారు. ఈ ప్ర‌క్రియ‌ పరీక్షల భద్రతకు కీల‌కంగా ఉంటుంద‌ని తెలిపారు. యూపీఎస్సీ వివిధ ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలను నిర్వహిస్తుంది. వీటిలో సివిల్ సర్వీసెస్ (IAS, IFS, IPS) వంటి ఉన్నత స్థానాల కోసం అధికారుల‌ను ఎంపిక చేస్తారు.

Read Also: బొడ్రాయిపై వికృత చేష్ట‌లు.. నిందితుడికి దేహ‌శుద్ధి

Follow Us On: Sharechat

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>