epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బొడ్రాయిపై వికృత చేష్ట‌లు.. నిందితుడికి దేహ‌శుద్ధి

క‌లం వెబ్ డెస్క్‌ : హైద‌రాబాద్‌లోని (Hyderabad) నేరెడ్‌మెట్‌లో ఓ ఆల‌యం ముందున్న బొడ్రాయిపై ఓ వ్య‌క్తి మూత్రం పోయ‌డం తీవ్ర వివాదానికి దారి తీసింది. స్థానికులు గుర్తించి నిందితుడికి దేహ‌శుద్ధి చేశారు. నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్ట మైసమ్మ గుడి ముందున్న‌ బొడ్రాయిపై ఆదివారం ఉద‌యం ఓ వ్య‌క్తి మూత్రం పోశాడు. ఇది గ‌మ‌నించిన స్థానికులు అత‌డిని ప‌ట్టుకొని చిత‌క‌బాదారు. ఆల‌యం ఎదుట వికృత చేష్ట‌లు చేయ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి భారీ ఎత్తున ప్ర‌జ‌లు చేరుకున్నారు. నిందితుడి దుస్తులు విప్పి రోడ్డుపై నిల్చోపెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నేరెడ్‌మెట్ పోలీసులు అక్క‌డికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన అల్తాఫ్‌గా పోలీసులు గుర్తించారు.

నేరెడ్‌మెట్ ప్రాంతంలో కూరగాయలు విక్రయిస్తూ జీవిస్తున్నాడ‌ని తెలిపారు. అల్తాఫ్‌పై 333, 196(2), 298, 299 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అల్తాఫ్‌ను కోర్టులో హాజ‌రుప‌ర్చ‌గా 14 రోజుల రిమాండ్ విధించింది. బొడ్రాయిపై వికృత చేష్ట‌లు చేయ‌డంపై బీజేపీ (BJP) రాష్ట్ర‌ అధ్యక్షుడు రామచంద్రరావు (Ramchander Rao) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గతంలో కూడా ఇలాగే ప‌లు ఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌న్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇలాంటి ప‌నులే జ‌రుగుతున్నాయ‌ని మండిప‌డ్డారు.

Read Also: గంటకు 3 వేల వాహనాలు.. పంతంగి మీదుగా సంక్రాంతి రష్..

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>