epaper
Sunday, March 1, 2026
epaper

ఇంజనీరింగ్​ సర్వీసెస్ (ప్రిలిమ్స్​)​ రిజల్ట్స్​ రిలీజ్​​

కలం, వెబ్​ డెస్క్: వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్నత స్థాయి ఇంజనీరింగ్​ ఉద్యోగాలకు కీలకమైన ఇంజనీరింగ్​ సర్వీసెస్​(ఈఎస్​ఈ​/ఐఈఎస్) ప్రిలిమినరీ ఎగ్జామ్స్​ రిజల్ట్స్​ విడుదలయ్యాయి(UPSC ESE 2026). ఈ నెల 8న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​(యూపీఎస్​సీ) గురువారం విడుదల చేసింది. అభ్యర్థుల పేర్లు, రోల్​ నెంబర్లతో కూడిన వివరాలను వెబ్​సైట్​లో ఉంచింది. ఇంజనీరింగ్​ సర్వీసెస్​ మెయిన్స్ పరీక్షను జూన్​ 21న నిర్వహించనుంది. దీనికి వారం ముందు అడ్మిట్​ కార్డులను డౌన్​లోడ్​ చేసుకునే అవకాశం ఉంటుందని ప్రకటించింది. వీటి ఫలితాలు వచ్చిన తర్వాతే ప్రిలిమినరీలో సాధించిన మార్కుల వివరాలు వెల్లడించనున్నట్లు పేర్కొంది. కేంద్ర రైల్వే, రక్షణ, విద్యుత్​, టెలికాం రంగాల్లో క్లాస్​ ఎ, క్లాస్​ బి గెజిటెడ్​ ఉద్యోగాల కోసం ఈ ఎగ్జామ్స్​కు ఎంతో కీలకం. దీనికోసం ఏటా ఎంతో మంది ఇంజనీరింగ్​ విద్యార్థులు పోటీ పడుతుంటారు. పరీక్ష ఫలితాలు, మరిన్ని వివరాలకు https://upsc.gov.in/ వెబ్​సైట్​లో చూడవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!