హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం

కలం, డెస్క్ : హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. జీడిమెట్లలోని పారిశ్రామిక వాడలో ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అందులో పనిచేస్తున్న కార్మికులు వెంటనే బయటకు వచ్చేశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగిన గోదాం ఇస్మాయిల్ ది అని పోలీసులు గుర్తించారు. అతను ఎప్పటి నుంచో ప్లాస్టిక్ గోదాం నిర్వహిస్తున్నాడని.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చిన పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపడుతామని పోలీసులు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>