Mobile Popup Ad
Mobile Popup Ad

ఉత్తరప్రదేశ్‌లో తుఫాన్ బీభత్సం.. 54 మంది మృతి

కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో తుఫాన్ (UP Storm) బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా సంభవించిన బలమైన తుఫాన్, వరదలతో రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయింది. ప్రకృతి విపత్తులో రాష్ట్ర వ్యాప్తంగా 54 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ప్రయాగ్ రాజ్ లోనే 16 మంది చనిపోయారు. గంటకు వంద కిలో మీటర్లకు పైగా వీచిన గాలులతో చాలా జిల్లాల్లో భారీ వృక్షాలు, చెట్లు నెలకొరిగాయి.

అలాగే అనేక చోట్లో విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో పాటు రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది. అయితే, మరణించిన వారిలో ఎక్కువగా పొలాల్లో పని చేస్తున్నవారితో పాటు వర్షం కారణంగా చెట్ల కిందకు వెళ్లి ఆశ్రయం పొందిన వారే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>