కలం, వెబ్ డెస్క్ : రోడ్లపై నమజ్ చేయడాన్ని అనుమతించకూడదని ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) స్పష్టం చేశారు. రహదారులు ఉన్నవి రాకపోకలు సాగించేందుకు మాత్రమేనని, అంతేగాని ప్రజలకు అసౌకర్యం కలిగించేందుకు కాదని స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనే మతపరమైన సమావేశాలను నిర్దేశిత ప్రదేశాలలో నిర్వహించుకోవాలన్నారు. ట్రాఫిక్ ను నివారించడానికి నమాజ్ షిఫ్టుల వారిగా చేసుకోవాలని సూచించారు. యూపీ ప్రజలు ఇప్పటికీ రోడ్లపై నమాజ్ చేస్తున్నారా అంటూ తనకు ప్రశ్నలు ఎదురవతున్నాయన్నారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు లేవని యోగి వెల్లడించారు.
ప్రజా రవాణాకు నిర్మించిన రోడ్లను దిగ్బంధించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. నిర్దేశిత ప్రాంతాల్లో నమాజ్ చేసుకోవాలని సూచించారు. చట్టం ప్రతి ఒక్కరికి సమానంగానే ఉంటుందన్నారు. నమాజ్ చేసుకోవడాన్ని తాము అడ్డుకోవడం లేదని.. కేవలం బహిరంగ రోడ్లపై జరగకూడదని సీఎం యోగి (Yogi Adityanath) స్పష్టం చేశారు. కాగా, గతంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలోనూ యోగి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. శాంతి భద్రతలు, బహిరంగ ప్రదేశాల్లో జరిగే మతపరమైన సమావేశాలకు సంబంధించి అప్పటి తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై యోగి తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read Also: మోదీ ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డ్
Follow Us On: WhatsApp

