కలం, వరంగల్ బ్యూరో: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో గ్రామంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న మక్కలు తడిసి ముద్దయ్యాయి. వర్షం దాటికి మక్కలు తడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో మక్కలు కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్డెక్కారు. అధికారుల వైఖరిని నిరసిస్తూ రైతులు మక్కలు దహనం చేశారు.

