Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రజావాణిపై ప్రజల ఆగ్రహం.. హుస్నాబాద్‌లో వినూత్న నిరసన

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా హుస్నాబాద్ (Husnabad) ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రజావాణి (Prajavani) దరఖాస్తు దారులు వినూత్న నిరసన తెలిపారు. ప్రజావాణి అనేది ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి వాటిని వేగంగా పరిష్కరించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న వేదిక అని అన్నారు. కానీ ప్రజావాణి వేదికగా అధికారులను కలిసి ఫిర్యాదులు ఇచ్చిన్నప్పటికీ వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రజా సమస్యలు పరిష్కరించని ప్రజావాణి కార్యక్రమం ఎందుకు” అంటూ ఫ్లెక్సీ బ్యానర్ తో ఆందోళన చేశారు. వెంటనే ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సంబంధిత అధికారులు విచారించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>