పెట్రోల్ ధరలు పెంపు‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా నెలకొన్న చమురు సంక్షోభం వల్లే కేంద్ర ప్రభుత్వం ధరల పెంపు నిర్ణయం తీసుకోవడం తప్పలేదన్నారు. ప్రజలపై భారం వేయడం కేంద్రం ఉద్దేశం కాదన్నారు. ప్రతిపక్షాల రాజకీయ విమర్శలను నమ్మవద్దని కిషన్ రెడ్డి ప్రజలను కోరారు. అమెరికా, జపాన్, జర్మని లాంటి దేశాలు కూడా గతంలోనే ఇంధన ధరలు పెంచాయన్నారు. కానీ, భారత్ మాత్రమే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచిందన్నారు.

అది కూడా తప్పనిసరిగా పెంచామని, కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ కోసం కాదని ఆయన (Kishan Reddy) స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలు కోసం ఇంధన ధరలు పెంచాల్సి వచ్చిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే, ప్రధాని మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపును పాటించాలని ఆయన కోరారు. కాగా, పెట్రోల్, డీజిల్ రేట్లు పెంపుపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రధాని మోదీ (PM Modi) చేతకాని తనం వల్లే ఇది జరిగిందని దుయ్యబట్టాయి.

Read Also: ఎన్నికల ముగింపు కానుక: పెట్రోల్ ధరల పెంపుపై మంత్రి ఫైర్‌

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>