సింగర్‌గా మారిన బండి సంజయ్.. దేశభక్తి పాటతో అదరగొట్టేశాడు!

కలం, వెబ్ డెస్క్: ఆర్ఎస్ఎస్ (RSS) స్థాపితమై వందేండ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సరికొత్త అవతారమెత్తారు. ఎప్పుడూ తన మాటలతో రాజకీయ క్షేత్రంలో చురుగ్గా ఉండే ఆయన గాయకుడిగా మారాడు. తన గళంతో ఎంతో ఆసక్తిగా ప్రత్యేక సంఘ్ పాటను ఆలపించాడు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో దేశభక్తిని, సంఘ్ సిద్ధాంతాలను ప్రతిబింబించేలా సాగే ఈ పాటకు ఆయన గొంతును అందించారు. ఈ పాటల రికార్డింగ్‌కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తనలోని కళాత్మక కోణాన్ని ప్రదర్శించడం పట్ల అటు కార్యకర్తలు, ఇటు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Read Also: నవరాత్రి వేళ సుందరకాండ పఠనంతో శుభఫలితాలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>