కలం, వెబ్ డెస్క్: ఏపీలో నిరుద్యోగులకు భారీ శుభవార్త. 720 పోస్టులతో గ్రూప్–2 నోటిఫికేషన్ (Group 2 Notification) విడుదల చేస్తూ ఏపీపీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచే ప్రారంభం కాగా, డిసెంబర్ 11వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. 720 పోస్టుల్లో 471 ఎగ్జిక్యూటీవ్ పోస్టులు, 249 నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు.
2027 ఫిబ్రవరి 21న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించబోతున్నారు. అనంతరం మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటి తేదీలను తరువాత ప్రకటించబోతున్నారు. ఈ పోస్టుల్లో డిప్యూటీ తహసీల్దార్ 203 పోస్టులు, డిప్యూటీ ఎంపీడీవో పోస్టులు 176, జీఎస్టీ ఆఫీసర్ 40 పోస్టులు, ఎక్సైజ్ ఎస్సై 29 పోస్టులున్నాయి. అర్హత, దరఖాస్తు విధానం, పరీక్ష పేపర్లు, వెయిటేజీ తదితర వివరాల కోసం కమిషన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.
Also Read : ఆర్యవీర్ సెహ్వాగ్ విశ్వరూపం.. ఆసియా కప్ సెమీస్లోకి భారత్!
Follow Us On : WhatsApp

