నవరాత్రి వేళ సుందరకాండ పఠనంతో శుభఫలితాలు

కలం, వెబ్ డెస్క్ : ప్రస్తుతం జరుగుతున్న వసంత నవరాత్రుల (Vasantha Navaratri)లో సుందరకాండ పారాయణం (Sundarakanda Parayanam) చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక పండితులు పేర్కొంటున్నారు. రామాయణంలోని అన్ని విభాగాల్లో కెల్లా అత్యంత శక్తివంతమైనదిగా భావించే సుందరకాండ, ముఖ్యంగా ఈ పవిత్ర రోజుల్లో భక్తులకు కొంగుబంగారంగా మారుతుందని వారు వెల్లడించారు. మనిషికి కొండంత కష్టం వచ్చినప్పుడు, ఏం చేయాలో తెలియని స్థితిలో సుందరకాండను ఆశ్రయించడం ఉత్తమమని సాధకులు చెబుతున్నారు. భక్తితో ఈ గ్రంథాన్ని తెరిచి చదివినప్పుడు, ప్రతి పేజీలోనూ మన సమస్యలకు ఏదో ఒక మార్గదర్శకం కనిపిస్తుందని అనేకమంది అనుభవం చెబుతోంది.

శని దోషాల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు సుందరకాండ పారాయణం (Sundarakanda Parayanam) చేయడం వల్ల ఉపశమనం పొందుతారని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సమస్యలు పూర్తిగా తొలగకపోయినా, వాటిని ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం లభిస్తుంది. ఆపద సమయంలో ప్రత్యేక పూజలు చేయలేకపోయినా, “జై హనుమాన్” అని స్మరించినా చాలని, ఆ స్వామి అభయ ప్రదాతగా ఆదుకుంటారని వారు నమ్ముతున్నారు.

సుందరకాండలో హనుమంతుడు సముద్రాన్ని దాటి, సీతమ్మను కనుగొని, రాముడికి శుభవార్త తీసుకువెళ్లే ఘట్టాలు ఎంతో విశిష్టమైనవి. లంకా విజయ ఘట్టాన్ని చదివితే భయాలు తొలగుతాయి. సీతా-హనుమ సంవాదం బంధుమిత్రుల కలయికకు దోహదం చేస్తుందని నమ్మకం. చూడామణి ప్రదానం జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని, రాక్షస వధ శత్రువులపై విజయాన్ని ఇస్తుందని భావిస్తారు. రాముడికి సందేశం అందించే భాగం చదివితే మనం  తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయని విశ్వాసం. పెళ్లి కాని వారు ప్రతిరోజూ సుందరకాండ పారాయణం చేస్తే వివాహ యోగం కలుగుతుందని, 68 రోజుల పాటు భక్తితో పఠిస్తే సంతాన ప్రాప్తి జరుగుతుందని అంటారు. ఈ వసంత నవరాత్రుల సమయంలో సుందరకాండను భక్తితో పఠించి, ఆంజనేయుని కృపతో సకల శుభాలను పొందాలని భక్తులు ఆశిస్తున్నారు.

Read Also: సంజీవని శకలం పడిన క్షేత్రం.. చాల్కాపూర్ హనుమాన్ ఆలయం

Follow Us On: Facebook

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>