కలం, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఓ పక్క సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో చేస్తున్న స్పిరిట్ చాలా స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. దీంతో పాటు హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న ఫౌజీ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్ గానే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి-2 (Salaar-2) షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే మోస్ట్ హైప్ ఉన్న సలార్-2 (Salaar-2) మూవీపై మాత్రం ఎలాంటి క్లారిటీ రావట్లేదు. మొదటి పార్టుతో పోలిస్తే సలార్-2పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎందుకంటే మొదటి పార్టులో అనేక ట్విస్టులు ఉంచాడు ప్రశాంత్ నీల్.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ ఓ భారీ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. దీని షూటింగ్ కర్ణాటకలో జరుగుతోంది. ఎలాంటి అప్డేట్లు ఇవ్వకుండా సైలెంట్ గానే షూటింగ్ కానిచ్చేస్తున్నాడు. అయితే ఒకేసారి రెండు సినిమాలను కూడా డైరెక్ట్ చేయగలడు ప్రశాంత్. కానీ ఎందుకో ఎన్టీఆర్ మూవీకే పూర్తిగా సరండర్ అయిపోయాడు. అటు ప్రభాస్ కూడా మూడు పెద్ద సినిమాల షూటింగులతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. అంత బిజీ నడుమ ప్రశాంత్ కోసం డేట్లు కేటాయించడం ఒకింత అనుమానమే. కాబట్టి ప్రశాంత్ కూడా అప్పుడే సలార్-2 జోలికి పోవట్లేదు. ఎన్టీఆర్ తో మెజార్టీ షూటింగ్ మే నెల చివరి వరకు కంప్లీట్ కాబోతోంది. ఆ లోపు స్పిరిట్, ఫౌజీ మూవీల షూటింగ్ కూడా మెజార్టీ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ప్రభాస్ కూడా కొంత ఫ్రీగానే ఉంటాడు. అందుకే జూన్ నుంచి సలార్-2 స్టార్ట్ చేసే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్టు తెలుస్తోంది.

