కలం, వెబ్ డెస్క్ : కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో మూడు కీలక నిర్ణయాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంటల మద్ధతు ధర పెంపునకు (MSP Hike) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోధుమలు, పప్పు ధాన్యాలకు మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గోధుమలకు రూ.2,610, శెనగలకు రూ.5,958 మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది.

