పాల్వంచలో భారీ కొండచిలువ కలకలం!

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palwancha) పట్టణంలోని శ్రీనివాస్ నగర్ కాలనీ గుట్ట సమీపంలో బుధవారం భారీ కొండచిలువ ప్రత్యక్షమై స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. గుట్ట పరిసర ప్రాంతంలో సంచరిస్తున్న సుమారు 12 అడుగుల పొడవున్న ఈ కొండచిలువ (12-Foot Python) ను చూసిన కాలనీవాసులు భయంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

​సమాచారం అందుకున్న వెంటనే అటవీ అధికారుల ఆదేశాలతో కొత్తగూడెం స్నేక్ రెస్క్యూ టీమ్ సభ్యులు రంగంలోకి దిగారు. కాలనీవాసులకు ఎటువంటి హాని కలగకుండా, చాకచక్యంగా వ్యవహరించి ఆ భారీ కొండచిలువను సురక్షితంగా బంధించారు. ​ఈ భారీ కొండచిలువను చూడటానికి సమీప ప్రాంతాల నుంచి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పట్టుకున్న కొండచిలువను సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెడతామని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. స్నేక్ రెస్క్యూ టీమ్ కొండచిలువను పట్టుకోవడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>