Mobile Popup Ad
Mobile Popup Ad

జీవో 46ను రద్దు చేయండి.. హైదరాబాద్‌లో నిరుద్యోగుల నిరసన

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ (Dilsukhnagar) బుధవారం నిరుద్యోగులు ఆందోళన చేశారు. జీవో 46ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది నిరుద్యోగ యువత, పోలీస్ అభ్యర్థులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద నిరుద్యోగులు (Unemployed Youth) పెద్ద సంఖ్యలో గుమిగూడి, రోడ్డుపై రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నినాదాలు చేశారు. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Read Also: యుద్ధం ఆపి.. నష్ట పరిహారం చెల్లించాలి.. ఇరాన్ కు గల్ఫ్ దేశాల డిమాండ్

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>