Mobile Popup Ad
Mobile Popup Ad

యుద్ధం ఆపి.. నష్ట పరిహారం చెల్లించాలి.. ఇరాన్ కు గల్ఫ్ దేశాల డిమాండ్

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ (Iran) తమ భూభాగాలపై చేస్తున్న దాడులను తక్షణమే నిలిపివేసి, నష్ట పరిహారం చెల్లించాలని గల్ఫ్ దేశాలు (Gulf Countries) డిమాండ్ చేశాయి. బుధవారం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో జరిగిన అత్యవసర చర్చలో ఆ దేశాలు పిలుపునిచ్చాయి. ఐక్యరాజ్యసమితి అత్యున్నత హక్కుల సంస్థలో జరిగిన ఈ సమావేశానికి ఆరు గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) దేశాలు, జోర్డాన్ కలిసి పాల్గొన్నాయి. గల్ఫ్ ప్రాంతంలోని దేశాలపై ఇరాన్ జరిపిన దాడులు, పౌరులపై వాటి ప్రభావంపై ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించారు. 47 మంది సభ్యులున్న గల్ఫ్ సహకార మండలి (GCC)తో పాటు జోర్దాన్.. ఇరాన్ జరిపిన దాడులను తీవ్రంగా ఖండించింది. హర్ముజ్ జలసంధిని మూసివేసే లక్ష్యంతో ఇరాన్ చేపట్టిన చర్యలను, ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ముసాయిదా తీర్మానాన్ని పరిశీలిస్తోంది.

GCC దేశాలు, జోర్డాన్‌పై ఇరాన్ (Iran) చేసిన దాడులను తక్షణమే బేషరతుగా నిలిపివేయాలని, అలాగే దాడుల వల్ల కలిగిన నష్టం, గాయపడిన బాధితులందరికీ తక్షణ పరిహారం అందించాలని జీసీసీ కోరింది. ఇరాన్ చేసిన దాడిని ఆయా దేశాలు ఉగ్రవాదంగా అభివర్ణించాయి. తమపై 26 రోజుల పాటు అన్యాయమైన దురాక్రమణ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాయి. అయితే, ఇరాన్ కు వ్యతిరేకంగా ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించే ప్రయత్నం చేయడంపై టెహ్రాన్ తీవ్రంగా స్పందిస్తూ ఇది చారిత్రాత్మక తప్పిదంగా అభివర్ణించింది.

Read Also: హుస్నాబాద్‌లో అక్రమంగా నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్లు సీజ్

Follow Us On : WhatsApp

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>