వేద పాఠశాలలో దారుణం: విద్యార్థిని చితకబాదిన టీచర్

కలం, వెబ్​ డెస్క్​ : మధ్యప్రదేశ్‌ ఉజ్జయిని (Ujjain)లోని మహర్షి సందీపని వేద పాఠశాల (Sandipani Veda School)లో విద్యార్థుల పట్ల క్రమశిక్షణ పేరిట ఒక దారుణ ఘటన చోటుచేసుకున్నది. ఒక చిన్న కారణంతో ఉపాధ్యాయుడు విద్యార్థి పట్ల క్రూరంగా ప్రవర్తించడం స్థానికంగా సంచలనంగా మారింది.

హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థి తన మంచంపై కాకుండా తోటి విద్యార్థి బెడ్‌పై పడుకున్నాడనే నెపంతో సదరు ఉపాధ్యాయుడు ఆగ్రహానికి గురయ్యాడు. క్రమశిక్షణ ఉల్లంఘించావంటూ ఆ బాలుడిని పిలిపించి, విచక్షణారహితంగా కర్రతో బాదాడు. ఆ విద్యార్థి శరీరంపై వాతలు పడేలా చితకబాదడమే కాకుండా, బాలుడు నొప్పితో విలవిల్లాడుతున్నా ఉపాధ్యాయుడు కనికరించలేదు. ఇప్పుడు దీనికి సంబందించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది. వేద విద్యను బోధించాల్సిన చోట విద్యార్థులపై ఇలాంటి అమానుష దాడులు జరగడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read Also: అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమ‌తులు షురూ!

Follow Us On: Facebook

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>