ప్లాస్టిక్ బ్యాన్ చేయండి.. సీఎంకు జ‌గిత్యాల మ‌హిళ‌ల లేఖ‌లు!

క‌లం, వెబ్ డెస్క్‌: రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయాల‌ని కోరుతూ జ‌గిత్యాల (Jagtial) ప‌ట్ట‌ణానికి చెందిన ప‌లువురు మ‌హిళ‌లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి పోస్టు కార్డ్ ద్వారా లేఖ‌లు రాశారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ప్ర‌క‌టించి, ప్ర‌భుత్వం ప్లాస్టిక్ వాడ‌కంపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. మేం ప్లాస్టిక్ వాడము, ఇత‌రుల‌ను వాడ‌నివ్వం అంటూ ప్రమాణం చేశారు. ప్లాస్టిక్ వాడ‌కం త‌గ్గించాల‌ని, ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించాల‌ని పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళ‌లు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ భూమిలో క‌రిగిపోయేందుకు 400 నుంచి వెయ్యి సంవ‌త్స‌రాల స‌మ‌యం ప‌డుతుంద‌ని, ఇది జంతువుల‌కు ప్రాణాంత‌కంగా మారుతుంద‌ని చెప్పారు. సింగిల్ యూజ్‌ ప్లాస్టిక్ త‌యారీ కేంద్రాల‌ను మూసివేయాల‌ని సీఎంను కోరారు. ఈ పోస్టుకార్డ్ ఉద్య‌మంలో అంద‌రూ భాగ‌స్వామ్యులై ప్లాస్టిక్ నిర్మూల‌న‌కు కృషి చేయాల‌ని సూచించారు.

Read Also: ‘కగార్’ కౌంట్ డౌన్.. మిగిలింది పది రోజులే…

Follow Us On: Facebook

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>