కలం, వెబ్ డెస్క్: మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ (India) ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు కీలక చర్యలు తీసుకుంటోంది. అమెరికా (USA) నుంచి భారత్ ఎల్పీజీ దిగుమతులు (LPG Imports) ప్రారంభించింది. తాజాగా ఆదివారం ఉదయం అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీతో వచ్చిన ఓ భారీ కార్గో నౌక మంగళూరు పోర్టుకు చేరుకుంది. దీని ద్వారా 16,714 టన్నుల ఎల్పీజీ దిగుమతి అయ్యింది. అమెరికా తాత్కాలిక సడలింపులు ఇవ్వడంతో సముద్రంలో నిలిచిపోయిన రష్యన్ ముడి చమురును తీసుకొస్తున్న మరో నౌక కూడా మంగళూరు తీరానికి చేరుకుంది. ఈ చమురును సింగిల్ పాయింట్ మూరింగ్ సిస్టమ్ ద్వారా పైప్‌లైన్ల ద్వారా ఎంఆర్‌పిఎల్ సంస్థకు తరలించనున్నారు.
యుద్ధం కారణంగా అత్యంత ప్రమాదకరంగా మారిన హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) దాటుకుని మరో రెండు భారతీయ గ్యాస్ (LPG Imports) నౌకలు గుజరాత్ తీరానికి సురక్షితంగా చేరుకున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం 611 మంది భారతీయ సిబ్బంది ఉన్న 22 నౌకలు ఉన్నాయి. వారి భద్రతను డీజీ షిప్పింగ్ నిరంతరం పర్యవేక్షిస్తోంది. సరఫరా కొరత ఏర్పడకుండా ఉండేందుకు భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను గణనీయంగా పెంచింది.
Read Also: బాచుపల్లి ఫ్లైఓవర్ పనులపై కేటీఆర్ విమర్శలు
Follow Us On : WhatsApp

