కలం, వెబ్ డెస్క్: ఉగాండా (Uganda)కు చెందిన మూసా హసాహ్య అనే 70 ఏళ్ల వ్యక్తి సంతానంలో సెంచరీ కొట్టిన కారణంగా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ఈయనకు 12 మంది భార్యలు, 102 మంది పిల్లలు ఉన్నారు. సుమారు 578 మందికి పైగా మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న ధరల కారణంగా పిల్లలను కనకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తన భార్యలందరికీ కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించాలని సూచించారు.
తనకున్న కొద్దిపాటి భూమిలో ఇంత పెద్ద కుటుంబాన్ని పోషించడం సాధ్యం కావడం లేదని, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానని వెల్లడించారు. పిల్లల (Children) సంఖ్య ఎక్కువగా ఉండటంతో, కనీసం వారి పేర్లు కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన ఈ నిర్ణయంతో పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Read Also: ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ : రన్నరప్ లక్ష్యసేన్
Follow Us On: Youtube

