Mobile Popup Ad
Mobile Popup Ad

అభిషేక్ హాఫ్ సెంచరీ.. భారత్‌కు తొలి వికెట్ షాక్

కలం, వెబ్​ డెస్క్​: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. అయితే, హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో వెనుదిరిగాడు. రవీంద్ర వేసిన వైడ్ డెలివరీని భారీ షాట్ ఆడబోయిన అభిషేక్.. వికెట్ కీపర్ సీఫెర్ట్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రవీంద్ర తాను వేసిన మొదటి బంతికే వికెట్ తీయడంతో స్టేడియంలోని లక్షలాది మంది భారత అభిమానులు ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయారు.

అభిషేక్ (Abhishek Sharma) అవుట్ అయ్యే సమయానికి భారత్ 7.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ అభిషేక్ 247.61 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. మరోవైపు సంజూ శాంసన్ 22 బంతుల్లో 38 పరుగులతో ఆడుతున్నాడు. జాకబ్ డఫీ వేసిన 2 ఓవర్లలో భారత్ ఏకంగా 35 పరుగులు రాబట్టింది. లోకీ ఫెర్గూసన్ వేసిన ఒకే ఓవర్‌లో 24 పరుగులు రావడంతో భారత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

ప్రస్తుతం క్రీజులోకి ఇషాన్ కిషన్ రాగా, భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర మాత్రమే ఇప్పటివరకు వికెట్ సాధించాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు భారత ఓపెనర్లు ఆదిలోనే చుక్కలు చూపించారు. వరుస వికెట్లు పడకుండా భారత్ ఇదే జోరును కొనసాగించి కివీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచుతుందో లేదో చూడాలి.

Read Also: ‘సీఎస్‌కు మరో ఎక్స్ టెన్షన్.. ప్రధానికి సీఎం రేవంత్ కీలక లేఖ

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>