Mobile Popup Ad
Mobile Popup Ad

తమిళనాడులో కీలక పరిణామం: ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్!

కలం, వెబ్ డెస్క్‌ : తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పు చోటుచేసుకోబోతోంది. డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin)ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలని ఆ పార్టీ నిర్ణయించిట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత ఎం.కె. స్టాలిన్ ఈరోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలు, పార్టీ పరాజయానికి దారితీసిన కారణాలపై ఈ భేటీలో లోతుగా చర్చించనున్నారు.

భవిష్యత్ కార్యాచరణపై పార్టీ ఎమ్మెల్యేలకు స్టాలిన్ దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష గళాన్ని బలంగా వినిపించే బాధ్యతను ఉదయనిధికి అప్పగించడం ద్వారా పార్టీలో కొత్త ఉత్సాహం నింపాలని డీఎంకే భావిస్తోంది. అయితే మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశం అనంతరం ప్రతిపక్ష నేత ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>