Mobile Popup Ad
Mobile Popup Ad

ఢిల్లీకి చేరిన కేరళ సీఎం సీటు పంచాయితీ!

కలం, వెబ్ డెస్క్ : కేరళ (Kerala) అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమయింది. అయితే, ఆ పార్టీకి సీఎం అభ్యర్థి ఎంపిక తలనొప్పిగా మారింది. కేరళలో పోటీ చేసిన యూడీఎప్ (యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్) 102 స్థానాలతో భారీ విజయం సాధించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంకి అప్పగిస్తూ కేరళ సీఎల్పీ కీలక తీర్మాణం చేసింది.

కేపీసీసీ (KPCC) ప్రధాన కార్యాలయంలో జరిగిన సీఎల్పీ భేటీలో సీఎం ఎంపికను కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు (Mallikarjun Kharge) అప్పగిస్తూ ఎమ్మెల్యేలు అందరూ ఏకవ్యాక్య తీర్మాణం చేశారు. ఈ నేపథ్యంలో కేరళ సీఎం (Kerala CM) ఎంపికపై తుది నిర్ణయం ఢిల్లీకి చేరింది. కాగా, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు ఉద్ధండుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎల్డీఎఫ్ నేత వీడీ సతీషన్ కు సీఎం పదవి పక్కా అనే వార్తలు వస్తున్నాయి. అలాగే, సీనియర్ నాయకుడు రమేశ్ చెన్నితాల ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన అనుచరులు ధీమాగా ఉన్నారు.

మరోవైపు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ (KC Venugopal) పేరు కూడా సీఎం రేసులో నిలవడంతో సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్ హైకమాండ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వేణుగోపాల్ వైపే మొగ్గుచూపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్న పరిశీలకులు ఢిల్లీకి వెళ్లారు. వారు సమర్పించే నివేదిక ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రి అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనుంది. ఆ తరువాత మే 10వ తేదీ నాటికి కేరళ ముఖ్యమంత్రిని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Read Also: కర్ణాటకలో షాకింగ్‌ ఘటన : పెళ్లి చేసుకున్న అక్కా తమ్ముడు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>