రామయ్య వారధి కుదేల్.. రాకపోకలు బంద్!

కలం ఖమ్మం బ్యూరో: దక్షిణ కాశీగా పేరొందిన భద్రాచలం (Bhadrachalam) పుణ్యక్షేత్రానికి, వారధిగా నిలిచే కొత్త వంతెన నిర్మించిన రెండేళ్ల వ్యవధిలోనే కుంగిపోవడం కలకలం రేపుతోంది. గతంలో పిల్లర్ కుంగుబాటుతో వివాదాల్లో నిలిచిన ఈ బ్రిడ్జి, ఇప్పుడు అప్రోచ్ రోడ్ కుంగిపోవడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సారపాక నుంచి వంతెనకు అనుసంధానంగా ఉన్న అప్రోచ్ రోడ్ భారీగా కుంగిపోవడంతో, అధికారులు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.

2024 ఏప్రిల్ 15న భద్రాచలంలో నూతన వంతెనను ప్రారంభించారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన ఈ వంతెన రెండేళ్ల పాటు కూడా చెక్కు చెదరకుండా ఉండలేకపోవడం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి, పర్యవేక్షణా లోపానికి అద్దం పడుతుందనీ పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా కొత్త బ్రిడ్జి మూసివేయడంతో, పాత వంతెన పై నుంచి రాకపోకలు సాగుతున్నాయి. భద్రాచలం వంతెన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కలిపే కీలకమైన మార్గం. కాబట్టి అధికారులు విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>