కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లా సత్తుపల్లి మండలంలోని ఎన్టీఆర్ నగర్ (NTR Nagar) లో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజునే (TDP Foundation Day) ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు యాదృచ్చికంగా మృతి చెందడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఎన్టీఆర్ నగర్‌కు చెందిన దేవా (12), నాగబాబు (12) అనే ఇద్దరు బాలురు ఆదివారం కావడంతో సరదాగా ఈత కొట్టేందుకు సమీపంలోని మట్టి క్వారీకి వెళ్లినట్లు సమాచారం. అయితే ఆ మడుగు లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే బాలురను బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఈ దుర్ఘటనతో ఎన్టీఆర్ నగర్‌లో విషాద వాతావరణం నెలకొంది. చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సరదాగా గడపాల్సిన క్షణం శాశ్వత విషాదంగా మారడంతో గ్రామం మొత్తం శోకసంద్రంగా మారింది.

