Mobile Popup Ad
Mobile Popup Ad

జనగామ జిల్లాలో విషాదం: కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

కలం, వెబ్ డెస్క్​ : జనగామ (Jangaon) జిల్లా చిల్పూర్ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నష్కల్ గ్రామ సమీపంలోని రామాలయం పక్కన ఉన్న కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను వంగాలపల్లి గ్రామానికి చెందిన అకిరా నందన్ (14), మనోజ్ కుమార్ (13)గా గుర్తించారు.

స్థానికంగా జరుగుతున్న నష్కల్ శ్రీరామ నవమి జాతరకు వెళ్లిన ఈ ఇద్దరు విద్యార్థులు, తిరిగి వస్తుండగా సమీపంలోని వాగు వద్ద ఆగారు. అక్కడ తమ సైకిల్‌ను కడుగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి సైకిల్‌తో సహా నీటిలో పడిపోయారు. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగి ఇద్దరూ మృతి చెందారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో వంగాలపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>