Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు లారీ డ్రైవర్లు సజీవ దహనం

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం(Khammam) జిల్లా, తిరుమలాయపాలెం మండలం పరిధిలోని మేకల తండా సమీపంలో సోమవారం అర్ధరాత్రి భీకర రోడ్డు ప్రమాదం (Road Accident)  చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు భారీ లారీలు అత్యంత వేగంతో ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు లారీ డ్రైవర్లు సజీవదహనం అయ్యారు. సమాచారం ప్రకారం, ఒక లారీ భారీ ఎత్తున బొగ్గు లోడుతో వెళ్తుండగా, ఎదురుగా ఆలుగడ్డల లోడుతో వస్తున్న మరో లారీ బలంగా ఢీకొంది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఢీకొన్న వెంటనే రెండు వాహనాల ఇంజిన్ భాగాలలో మంటలు చెలరేగాయి. బొగ్గు లోడు ఉండటంతో మంటలు క్షణాల్లోనే లారీ మొత్తం వ్యాపించాయి.

మంటలు వేగంగా వ్యాపించడంతో క్యాబిన్‌లలో చిక్కుకున్న డ్రైవర్‌లు బయటకు వచ్చే అవకాశమే లేకుండా పోయింది. దీంతో ఇద్దరూ లారీలలోనే సజీవదహనమైనట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాద ధాటికి రెండు లారీల క్యాబిన్‌లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. రోడ్డంతా బొగ్గు, ఆలుగడ్డలు చెల్లాచెదురుగా పడిపోయాయి. లారీలు మంటలలో దగ్ధమవుతుండటంతో హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.​

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>