Mobile Popup Ad
Mobile Popup Ad

అమరావతిలో శరవేగంగా నిర్మాణ పనులు: మంత్రి నారాయణ

కలం, వెబ్‌డెస్క్: అమరావతి (Amaravati) రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ (Minister Narayana) స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో 98.06 శాతం మంది రైతులకు ప్లాట్లు కేటాయించినట్లు తెలిపారు. కేవలం 674 మంది రైతులకు ప్లాట్ల కేటాయింపు పెండింగ్‌లో ఉందని, త్వరలోనే వారికి కూడా కేటాయిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాలు పనిగట్టుకుని అమరావతిపై రాజకీయ కుట్ర చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే భూములు ఇచ్చిన రైతులకు ఈ-లాటరీ విధానం ద్వారానే ప్లాట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. త్వరలో అన్ని భవనాలను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD)కు అప్పగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>