కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి విరుచుకపడ్డారు. “బీజేపీ–ఈసీ దొంగల మార్కెట్‌లో దొంగతనం ఎంత పెద్దది అయితే.. బహుమానం అంత పెద్దగా ఉంటుంది” అని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ నూతన చీఫ్ సెక్రటరీగా మనోజ్ అగర్వాల్ నియామకంపై స్పందిస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఎవరీ మనోజ్ అగర్వాల్..?
పశ్చిమ బెంగాల్ చీఫ్ పోల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మనోజ్ అగర్వాల్‌ను సీఎం సువేందు అధికారి చీఫ్ సెక్రటరీగా నియమించారు. రాష్ట్రంలో జరిగిన ‘సర్’ ప్రక్రియను మనోజ్ అగర్వాల్ పర్యవేక్షించారని.. దాని ఫలితంగా లక్షల మంది ఓటు హక్కు కోల్పోయారని టీఎంసీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. బీజేపీకి ప్రయోజనం చేకూర్చడానికే మనోజ్ అగర్వాల్ ఇలా చేశారని.. ఫలితంగానే ఆయనకు చీఫ్ సెక్రటరీ పదవినిస్తూ సువేందు ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ అయినట్లు విమర్శిస్తున్నాయి. మరో పోలింగ్ అధికారి శుభ్ర గుప్తా సైతం సర్ ప్రక్రియలో కీలక పాత్ర పోషించగా.. ఆయన్ను నిన్ననే సీఎం సువేందు అధికారి తన టీంలో చేర్చుకోవడం గమనా

