కలం వెబ్ డెస్క్ : ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మడకశిర(Madakasira) మండలం ఆగ్రంపల్లిలో బొలెరో వాహనాన్ని మరో వ్యాన్ ఢీ కొట్టింది. దీంతో బొలెరోలో ఉన్న వాళ్లిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వ్యాన్‌లో ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డ వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు.


