కలం వెబ్ డెస్క్ : శ్రీశైలం(Srisailam)లో జనావాసాల్లో చిరుత(Leopard) సంచరించడం తీవ్ర కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి పాతాళగంగ సమీపంలోని ఓ ఇంటి దగ్గర చిరుత ప్రత్యక్షమైంది. కొద్దిసేపు ఇంటి చుట్టూనే తిరిగింది. ఈ చిత్రాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పాతాళ గంగలో పుణ్యస్నానాలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ(Forest Department) అధికారులు సూచిస్తున్నారు. సీసీ కెమెరాలో చిరుతకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


