కలం, వెబ్‌డెస్క్: అమెరికా (US)లోని ఇడాహోలో గల మౌంటైన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో నిర్వహించిన గన్ ఫైటర్ స్కైస్ ఎయిర్ షో (Air Show)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రదర్శనలో పాల్గొన్న యుద్ద విమానాలు రెండు గాలిలోనే ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే విమానాల్లోని నలుగురు క్రూ సిబ్బంది పారాచుట్ల సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం ధాటికి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మిలిటరీ బేస్‌ను కొద్దిసేపు లాక్‌డౌన్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఎయిర్ షో ముగింపు వేడుకలను అధికారులు రద్దు చేశారు.
ప్రమాదానికి గురైన యుద్ధ విమానాలు వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన ఎలక్ట్రానిక్ అటాక్ స్క్వాడ్రన్‌కు చెందినవని, ఒక్కో విమానం విలువ సుమారు రూ.560 కోట్లకు పైగా ఉంటుందని నౌకాదళ ప్రతినిధి కమాండర్ అమేలియా ఉమాయం తెలిపారు. సురక్షితంగా ఎజెక్ట్ అయిన నలుగురు సిబ్బందికి ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదని, వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. కాగా, ఈ వైమానిక ప్రమాదంపై ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.
Read Also: పీఎం మోదీకి స్వీడన్ ప్రతిష్టాత్మక పురస్కారం
Follow Us On: WhatsApp

