కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) మాటలు నమ్మి తల్లిదండ్రులు ఎవరూ మోసపోవద్దని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి (Rachamallu) వ్యాఖ్యానించారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెబుతున్నప్పటికీ, ప్రస్తుతం ప్రకటిస్తున్న నజరానా కేవలం కాన్పు ఖర్చులకు మాత్రమే సరిపోతుందని విమర్శించారు. అదనంగా సంతానం కలిగిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే ప్రతి ఏడాది రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించాలని సూచించారు. పిల్లల అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించేలా జీవో విడుదల చేయాలని కోరారు. ఈ జీవోకు శాశ్వత గ్యారెంటీ ఉండాలని, భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా కూడా అది అమలులో ఉండేలా చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (Rachamallu) పేర్కొన్నారు. ప్రజలను ఆకట్టుకునే ప్రకటనలు చేయడం కాకుండా, కుటుంబాలకు దీర్ఘకాలిక భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Read Also: చైనాలో భూకంపం.. ఇద్దరు వ్యక్తులు మృతి
Follow Us On: WhatsApp

