కలం, వెబ్ డెస్క్ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (PM Modi) మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. స్వీడన్ (Sweden) ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్’ (Polar Star Commander Grand Cross) అవార్డును ప్రకటించింది. విదేశీ దేశాధినేతలు, ప్రముఖులకు అందించే అత్యంత ప్రతిష్టాత్మక గౌరవాలలో ఇది ఒకటిగా భావిస్తారు. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో విశేష కృషి చేసిన నాయకులకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
భారత్-స్వీడన్ సంబంధాల అభివృద్ధికి, ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను పెంచడంలో ప్రధాని మోదీ (PM Modi) చేసిన సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందించారు. ఈ అవార్డుతో ప్రధాని మోదీకి ఇప్పటివరకు లభించిన అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 31కి చేరింది. ఇప్పటికే అనేక దేశాలు మోదీకి అత్యున్నత పౌర పురస్కారాలను అందజేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశానికి ఇది ఎంతో గర్వకారణమని పేర్కొంటున్నారు.
Read Also: మద్యం రేట్ల పెంపుపై ఎక్సయిజ్ శాఖ ఎక్సర్‌సైజ్!
Follow Us On: WhatsApp

