కలం, వరంగల్ బ్యూరో: రెండు కార్లు ఢీ కొన్న ప్రమాదంలో వృద్దురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా మడికొండకు చెందిన భోగి నాగలక్ష్మి (75) బంధువులతో కలిసి కారులో ములుగు వెళ్తోంది. ఆత్మకూర్ నుంచి వరంగల్ కు వస్తున్న కారు ఊరుగొండ (Oorugonda) వద్ద డివైడర్ నూ ఢీ కొని నాగలక్ష్మి ప్రయాణిస్తున్న కారు పై పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న నాగలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: మహిళా సాధికారత వారోత్సవాలకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం
Follow Us On: Instagram

