కలం, క్రైమ్ బ్యూరో : మేడ్చల్ (Medchal)లో అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే .. ఉగ్రవాద లింక్‌లు కలిగి ఉన్నాడనే సమాచారం మేరకు జయీద్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన జయీద్ ఖాన్ కొన్నేళ్ల క్రితం మేడ్చల్‌కు వచ్చి స్థానికంగా ఉండే ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. అయితే జయీద్ ఖాన్ సోషల్ మీడియాలో ఉగ్రవాద సంస్థలను ఫాలో అవుతున్నాడు.
అంతేకాకుండా ఐఎస్ఐ సానుభూతిపరులతో జయీద్ ఖాన్ పలుమార్లు సంప్రదింపులు జరిపాడు. జయీద్ ఖాన్ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం జయీద్ ఖాన్ సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంచింది. అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతున్నాడని నిర్ధారించకున్న తర్వాత మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో మేడ్చల్ పోలీసులు జయీద్ ఖాన్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జయీద్ ఖాన్ పలుమార్లు ఉగ్రవాద సంస్థ సానుభూతిపరులతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. నిరంతరం వాయిస్ కాల్స్, చాటింగ్ ద్వారా టచ్‌లో ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. అతని వద్ద ఉన్న రెండు నకలీ పిస్టళ్లను,మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు.

