హైద‌రాబాద్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు బీటెక్ స్టూడెంట్స్ మృతి!

క‌లం, వెబ్ డెస్క్‌: హైద‌రాబాద్‌ (Hyderabad)లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. వ‌న‌స్థ‌లిపురం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని సాగ‌ర్ రోడ్డు హ‌స్తినాపురం స‌మీపంలో బుధ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు బీటెక్ స్టూండెంట్స్‌తో పాటు మ‌రో వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయారు. ఓ కారు అతి వేగంగా వ‌చ్చి బైక్‌పై వెళ్తున్న విద్యార్థుల‌తో పాటు రోడ్డు ప‌క్క‌నే న‌డుచుకుంటూ వెళ్తున్న వ్య‌క్తిని ఢీకొట్టింది. దీంతో విద్యార్థులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, మ‌రో వ్య‌క్తి తీవ్ర గాయాల‌పాలై చికిత్స పొందుతూ ఆస్ప‌త్రిలో మృతి చెందాడు. విద్యార్థులిద్ద‌రూ స్థానిక మ‌హావీర్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. విద్యార్థుల మృతితో కాలేజీ యాజ‌మాన్యం, విద్యార్థులు రోడ్డుపై ఆందోళ‌న‌కు దిగారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ఆందోళ‌న‌ను విర‌మింప‌జేశారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Read Also: తెలంగాణ టూరిజం.. సమ్మర్ లో చుట్టేద్దాం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>