కలం, వెబ్ డెస్క్ : భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న రెపో రేటును 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడంతో పాటు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వడ్డీ రేట్లు పెరుగుతాయని ఆందోళన చెందిన రుణగ్రహీతలకు, ముఖ్యంగా గృహ, వాహన రుణాలు తీసుకున్న సామాన్యులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. ఆర్బీఐ (RBI) నిర్ణయంతో బ్యాంకుల నుంచి అందే రుణాలపై వడ్డీ రేట్లు ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే స్థిరంగా ఉండే అవకాశం ఉంది.
Read Also: తెలంగాణ టూరిజం.. సమ్మర్ లో చుట్టేద్దాం
Follow Us On: Sharechat

