కాళేశ్వరం అటవీ ప్రాంతంలో గుప్తనిధుల వేట.. ఇద్దరు అరెస్ట్

కలం, భూపాలపల్లి : భూపాలపల్లి (Bhupalpally) జిల్లా కాళేశ్వరం (Kaleshwaram) అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం అన్వేషిస్తున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హనుమకొండ జిల్లా సుధానగర్‌కు చెందిన వలబోజు శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లా టీచర్స్ కాలనీకి చెందిన ఇంజారపు వెంకటరమణ ప్రసాద్ గత ఆరు నెలలుగా కాళేశ్వరం పరిసర అటవీ ప్రాంతాలలో  గుప్తనిధుల కోసం అన్వేషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

వారిని అదుపులోకి తీసుకున్న అనంతరం వారి వద్ద నుంచి గుప్తనిధుల అన్వేషణకు ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గుప్తనిధుల పేరుతో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీసీఎస్ సీఐ రమేష్ హెచ్చరించారు. ఈ తరహా అక్రమాలపై నిఘా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Read Also: మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు మంజూరు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>