కలం, వెబ్ డెస్క్ : రైలు నుంచి కిందపడి నవ దంపతులు మృతి చెందిన కేసులో (Couple Death Case) కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. యాదాద్రి భువనగిరి జిల్లా వంగల్లి ఆలేరు రైలు మార్గంలో రైలు కిందపడి కొత్త జంట మృతిచెందిన సంగతి తెలిసిందే.. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం, భవానిగా అధికారులు గుర్తించారు. వీళ్లకు రెండు నెలల క్రితమే వివాహం అయింది. నూతన దంపతులు ఇద్దరు హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నారు. విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ రైలులో బయలుదేరగా పంగపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత డోర్ నుంచి కిందపడి మరణించారు. అయితే ముందు వీరిద్దరూ ప్రమాదవశాత్తూ మరణించారని అంతా అనుకున్నారు.. కానీ ఈ కేసులో ఇప్పుడు ట్విస్ట్ చోటుచేసుకుంది.
తాజాగా వీరికి సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో ఆత్మహత్యలుగా అనుమానం వ్యక్తం అవుతున్నాయి. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో భార్యాభర్తలు ఇద్దరు గొడవపడ్డారు. భార్య భవానీ రైలు నుంచి దూకుతానని భర్త సింహాచలంను బెదిరిస్తుంది. భవానీ బెదిరింపులకు భయపడిన భర్త ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇదంతా అక్కడే ఎదురుగా ఉన్న గుర్తుతెలియని వ్యక్తి దీనికి సంబంధించిన వీడియోను రికార్డ్ చేశాడు. ఈ క్రమంలోనే కోపంతో భవానీ రైలు నుంచి దూకేసింది. ఆమె దూకడంతో భవానీ కోసం సింహాచలం సైతం రైలు నుంచి దూకేశాడు. రైలు వేగంతో ఉండడంతో ఇద్దరూ(Couple Death Case) తీవ్ర గాయాలతో మరణించారు.
Read Also: గెలిచే మ్యాచ్ ఓడిపోవడానికి వాళ్లే కారణం: మార్క్‌రమ్
Follow Us On: Youtube


