కలం డెస్క్: భారత్‌తో జరిగిన ఐదో టీ20లో దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. వాస్తవానికి అడి గెలిచే మ్యాచ్ అని, అయినా ఓడిపోయామని దక్షిణాప్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ (Aiden Markram) అన్నారు. అందుకు మిడిలార్డర్ వైఫల్యమే కారణమని చెప్పాడు. ఐదో టీ20 ఓటమితో సౌతాఫ్రికా 1-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐదో టీ20లో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది. ఐదో టీ20 ఓటమిపై సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే బ్యాటర్లు సమష్టిగా రాణించాల్సిందని చెప్పాడు. డికాక్‌తో పాటు టాప్ ఆర్డర్ అద్భుత ఆరంభం ఇచ్చినా, మిడిల్ ఓవర్లలో ఆ జోరును కొనసాగించలేకపోయామని పేర్కొన్నాడు. ఈ సిరీస్ టీ20 ప్రపంచకప్‌కు ముందు తమకు కీలక పాఠాలు నేర్పిందని మార్క్‌రమ్ (Aiden Markram) అన్నాడు. జట్టు కాంబినేషన్‌పై స్పష్టత వచ్చిందని, ప్రపంచకప్‌కు సిద్ధంగా ఉండేందుకు ఈ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాడు.
Read Also: బాగా ఆడినా సెలక్టర్లు పట్టించుకోలేదు: ఇషాన్ కిషన్
Follow Us On: Sharechat


